Trivikram Srinivas Inner Haeart


త్రివిక్రమ్ శ్రీనివాస్ తాజాగా ఒక న్యూస్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ కి తనతో వున్నా స్నేహం గురించి ప్రస్తావించారు . పవన్‌ కల్యాణ్‌ నా స్నేహితుడు. ఆయన ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటా. వ్యక్తిగా ఆయన చాలా మంచోడండీ. ఇంకొకడిది ఆశించడు. ఎదుటివాళ్ల కడుపు కొట్టి సంపాదించడం ఎందుకు? అనే మనస్తత్వం ఆయనది.  ‘అజ్ఞాతవాసి’ సినిమా తరవాత.. పంపిణీదారులకు నష్టాలొచ్చాయని అర్థమైంది. 90 కోట్లకు కొన్నారు, అరవై వచ్చింది. అంటే రూ.30 కోట్లు సర్దాలన్నమాట. నేనూ, కల్యాణ్‌గారు, నిర్మాత ముగ్గురూ పాతిక కోట్లు సర్దుబాటు చేశాం. ‘అజ్ఞాతవాసి’ విడుదలైన వారం రోజులకు ఎవరి డబ్బులు వాళ్లకు ఇచ్చేశాం. ఇదేదో మేం గొప్పోళ్లం అని చెప్పుకోవడానికి కాదు. ‘మనల్ని నమ్మి ఎదుటివాడు ఎందుకు చెడిపోవాలి?...’ అనే విధంగా కల్యాణ్‌ ఆలోచనలు ఉంటాయి. 
తన కుటుంబ సభ్యులని ఎందుకు బయటకు తీసుకురావడం లేదో అనే విషయం మీద వివరణ ఇచ్చారు నా కుటుంబాన్ని సినిమా ప్రభావితం చేయకూడదనే వాళ్లని బయటికి తీసుకురాను. ఓ గొప్పవాడి కొడుకు అవ్వడం గొప్పదనం కాదు. పొడుగ్గా ఉంటేనో, రంగు వస్తేనో పొంగిపోకూడదు. అది మన కష్టం కాదు. తల్లిదండ్రుల జీన్స్‌. 
ఇలాంటి వాటికి గర్వపడిపోతారేమో అని నా భయం. అంతే తప్ప పొగరు, అహంకారం, సీక్రెసీనో కాదు.

రిటైర్  అయిన రాజకీయ నాయకులు, వ్యభిచారులు తరువాత తరువాత కీర్తి శేషులు అయిపోతారని, అలాగే అజ్ఞాతవాసి కూడా ఒకప్పటికి మంచి సినిమా అనిపించేసుకోవచ్చని అన్నారు. కాకిపిల్ల కాకికి ముద్దు అని ఆయనకు అజ్ఞాతవాసి ఇంకా ముద్దుగానే వుంది. మామూలుగా, రాజ్యం, రాజు అంటే ఓకె అనేవారని, కార్పొరేట్ స్టయిల్ లో తీయడం వల్ల ఆడలేదని అంటున్నారు. అంటే జనాల స్థాయిని త్రివిక్రమ్ తక్కువ అంచనా వేస్తున్నట్లు వుంది.
మంచి సినిమాను జనాలు ఎప్పుడూ వదులుకోలేదు. అది పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా. తానేదో మేధావితనం రంగరించిన ఆధునిక సినిమా తీసానని, అందుకే జనాలకు నచ్చలేదని త్రివిక్రమ్ ఆత్మ వంచన చేసుకుంటున్నారేమో? ఓ పక్క తప్పులు జరగలేదని అనడం తప్పే అవుతుందని అంటూనే అజ్ఞాతవాసిని ఈ విధంగా త్రివిక్రమ్ డిఫెండ్ చేసుకోవడం అంటే ఏమనుకోవాలి?
పైగా అ..ఆ సినిమా టైమ్ లో యద్దనపూడికి క్రెడిట్ ఇవ్వకుండా, ఆ తరువాత వచ్చిన విమర్శలకు లొంగి క్రెడిట్ ఇచ్చి, విజయనిర్మలకు పేటెంట్ హక్కుల కింద డబ్బులు చెల్లించిన త్రివిక్రమ్ ఇప్పుడు యద్దనపూడిని అహో అంటూ పొగడడం, ఆమె నవలనే సినిమాగా తీసానని ఒప్పకోవడం విశేషం.
ఒక విధంగా త్రివిక్రమ్ తన మీద వస్తున్న గ్యాసిప్ లకు, విమర్శలకు సమాధానం ఇవ్వాలని డిసైడ్ అయి పత్రికలకు ఇంటర్వూ ఇచ్చినట్లు కనిపిస్తోంది. తనకు హీరోయిన్లతో లింక్ లు పెడుతున్నారని ఎదురు దాడి చేయడం, తనకు పవన్ కు మధ్య ఎడం పెరగలేదని, స్నేహం కొనసాగుతోందని చెప్పుకునే ప్రయత్నం చేయడం, అలాగే అజ్ఞాతవాసి ముఫై కోట్ల నష్టాలు పూడ్చేసామని ప్రకటించడం, ఇలా చాలా విషయాల మీద వివరణ కోసం త్రివిక్రమ్ ఇంటర్వూలు ఇస్తున్నట్లుంది.
మొత్తం మీద త్రివిక్రమ్ కాస్త దిగివచ్చినట్లే అనుకోవాలి. ఇన్నాళ్లు ఎవరు ఏమనుకుంటేనేం అన్నట్లు వుండే త్రివిక్రమ్ తనపై వచ్చే వార్తలకు, గ్యాసిప్ లకు వివరణ ఇచ్చే స్టేజ్ కు వచ్చారు.

Share this

Related Posts

Previous
Next Post »